»A Mother Who Named A Muslim Child After Rama In Uttar Pradesh
Muslim child: ముస్లిం బిడ్డకు రాముడి పేరు
అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగిన రోజు చాలా మంది గర్భిణులు డెలివరీ అయ్యారు. ఒక మస్లిం మహిళ కూడా అదే రోజు పడ్డంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అతనికి రాముడి పేరు కలిసొచ్చేలా నామకరణం చేసింది.
A mother who named a Muslim child after Rama in Uttar Pradesh
Muslim child: అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు పుట్టిన బిడ్డకు రాముడి పేరు కలిసి వచ్చేలా ఓ ముస్లిం జంట నామకరణం చేశారు. తమ బిడ్డకు ‘రామ్ రహీమ్’(Ram Rahim) అంటూ పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఫర్జానా సోమవారం మధ్యాహ్నం పడ్డంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రాముడి విగ్రహ ప్రతిష్ఠ ముహూర్త సమయంలోనే తనకు నార్మల్ డెలివరీ కావడంతో బిడ్డకు రాముడి పేరు పెట్టుకున్నట్లు ఫర్జాన వెల్లడించింది.
చదవండి:Ayodhya Ram Mandhir: బాలరాముడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
అయోధ్య రామమందిరంలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం దివ్యమైందని భావించి చాలా మంది గర్భిణులు సిజేరియన్ చేయించుకున్నారు. అలా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోనే సోమవారం 25 మంది గర్భిణులు ప్రసవించారు. అందులో 10 మంది అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలు ఉన్నారు. ఇక ఫర్జానాతో సహా పలువురికి నార్మల్ డెలివరీలు అయ్యాయని తెలుస్తుంది. పుట్టిన పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అబ్బాయిలకు రాముడి పేరు, అమ్మాయిలకు సీత పేరు కలిసి వచ్చేలా తల్లిదండ్రులు పెడుతున్నారు.