»33kg Luxurious Mukut Donated By Ambani Family For Ram Mandir
Ram Mandir : అయోధ్య రాములోరి కోసం అంబానీ అద్భుతమైన బహుమతి
ప్రతి ఒక్కరూ ముఖేష్ అంబానీ, అతని కుటుంబం మొత్తం మీద ఓ కన్నేసి ఉంటారు. అంబానీ కుటుంబం తమ వ్యాపారాన్ని అద్భుతంగా నడిపించడమే కాకుండా మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
Ram Mandir : ప్రతి ఒక్కరూ ముఖేష్ అంబానీ, అతని కుటుంబం మొత్తం మీద ఓ కన్నేసి ఉంటారు. అంబానీ కుటుంబం తమ వ్యాపారాన్ని అద్భుతంగా నడిపించడమే కాకుండా మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇటీవల, రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అంబానీ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం జరిగింది. దీనికి దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంబానీ కుటుంబం సభ్యులు కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు. కోట్లాది రూపాయల విలువైన రామ మందిర నిర్మాణానికి అంబానీ కుటుంబం చాలా ఖరీదైన విరాళం ఇచ్చిందన్న వార్త వెలుగులోకి వచ్చింది. రామ మందిర శంకుస్థాపనకు లక్షలాది మంది తరలివచ్చారు. ఇటీవల ఈ ప్రారంభోత్సవ వేడుకకు ముందు ఈ ఆలయానికి అంబానీ కుటుంబీకులు మూడు బంగారు కిరీటాలు కానుకగా ఇచ్చారని గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నారు. ఈ మూడు కిరీటాల బరువు దాదాపు 33 కిలోలు, వాటి విలువ కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు.
ఈ పెద్ద వార్త విని అందరూ అంబానీ కుటుంబాన్ని పొగడడం మొదలుపెట్టారు. అయోధ్యలోని రామ మందిరంలో 33 కిలోల కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన వార్త విన్న ప్రతి ఒక్కరూ అంబానీ కుటుంబ విలువలను కొనియాడారు. అయితే ఈ విషయాన్ని నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఇంకా ధృవీకరించలేదు. ఇది మాత్రమే కాదు, ఇప్పటివరకు ఆలయానికి ముఖేష్ అంబానీ నుండి ఎటువంటి బహుమతి రాలేదని రామ్ ఆలయ అధికారి స్వయంగా ప్రకటించారు. దీంతో అంబానీ ఫ్యామిలీ రాములోరికి బంగారు కిరీటం దానం చేశారన్న వార్తలు అవాస్తమని తేలింది.