• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

కూర్మాసనం వల్ల కలిగే ఉపయోగాలు

కూర్మాసనం(తాబేలు భంగిమ) వెన్నెముకను బలోపేతం చేస్తూ వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నెముకను సాగదీయడం ద్వారా ఇది వీపు, భుజాలు, తుంటి కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం ఉదర భాగంపై ఒత్తిడి తెచ్చి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. మెదడుకు, శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని తగ్గించి విశ్రాంతి ఇస్తుంది.

February 24, 2026 / 07:02 AM IST

శీతల పానీయాలు తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుందా?

శీతల పానీయాలు తాగడం వల్ల గ్యాస్ తగ్గుతుందని అనుకోవడం పొరపాటని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిలోని చక్కెర, కెఫిన్ వల్ల ఆమ్లత్వం మరింత పెరుగుతుంది. కడుపు ఉబ్బరం తగ్గాలంటే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా చల్లని పాలు లేదా సోంపు గింజలు తీసుకుంటే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు.

February 23, 2026 / 09:55 PM IST

PIC OF THE DAY❤️

పైనున్న చిత్రం భాగ్యనగరపు నడిబొడ్డున వెలిసిన అందమైన దృశ్యంలా ఉంది. చారిత్రక చార్మినార్ రాత్రివేళ కాంతులతో మెరిసిపోతుంటే, దాని ముందు గాలిలో తేలుతున్న ఎర్రని బెలూన్లు ప్రేమానురాగాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ ఆ బెలున్లు పాతబస్తీ సంస్కృతికి ఆధునిక ప్రేమ సందేశాన్ని జోడించాయి. ఈ చిత్రం HYD ఆప్యాయతను, చారిత్రక సౌందర్యాన్ని ఒకే ఫ్రేమ్‌లో బంధించింది.

February 23, 2026 / 09:42 PM IST

మహిళలు కుంకుమపువ్వు తీసుకుంటే?

కుంకుమపువ్వు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక మూలకాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ కుంకుమపువ్వును నిత్యం పాలు, టీ రూపంలో తీసుకోవాలి. చర్మం నిగారింపునకు తోడ్పడుతుంది. రోజుకు 30mg కంటే ఎక్కువ తీసుకోవద్దు.

February 23, 2026 / 12:03 PM IST

పాలు తాగితే కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందా?

పాలు జంతు సంబంధిత ఆహారం కాబట్టి ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేసే కొవ్వులు ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు పాలను మానేయడం సరికాదు. శరీర ఆరోగ్యాన్ని బట్టి పాలను ఎంచుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనుల్లో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇరుకుగా చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

February 23, 2026 / 10:36 AM IST

రోజుకు 10 వేల అడుగులు సరిపోతాయా?

మంచి గుండె ఆరోగ్యానికి వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన-ఏరోబిక్ కార్యకలాపాలతో పాటు వ్యాయామం చేయాలి. ఇందులో నడక, సైక్లింగ్ లేదా మెట్లు ఎక్కడం వంటివి ఉండొచ్చు. రోజుకు 10,000 అడుగులు పూర్తి చేయడం మంచి విషయమే అయినప్పటికీ.. ఇది గుండె రక్షణకు పూర్తి హామీ ఇవ్వదు. వాకింగ్‌తో పాటు సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడిని నిర్వహించడం అవసరం.

February 23, 2026 / 07:05 AM IST

బకాసనం వల్ల కలిగే ఉపయోగాలు

బకాసనం (క్రేన్ పోజ్) చేతులు, భుజాలు, మణికట్టును బలోపేతం చేసే శక్తివంతమైన యోగాసనం. పొత్తికడుపు కండరాలను టోన్ చేసి బలపరుస్తుంది. శరీర సమతుల్యతను, మానసిక ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. వెన్నుముకను సాగదీసి, భుజాలు, గజ్జల వశ్యతను పెంచుతుంది. ఉదర ప్రాంతంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

February 23, 2026 / 06:22 AM IST

పడుకునే ముందు ఈ పని చేయండి!

పడుకునే ముందు పుస్తకం చదివే అలవాటు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజంతా పడ్డ అలసటను, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గం. మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండి పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది, తద్వారా నిద్ర నాణ్యత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడానికి, సృజనాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

February 22, 2026 / 09:28 PM IST

అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ ఎందుకు ఇష్టం..?

సైకాలజీ ప్రకారం బ్యాడ్ బాయ్స్ అతి ఆత్మవిశ్వాసంతో వారికి నచ్చినట్టు ఉంటారు. ఇది కొంతమంది అమ్మాయిలకు బలమైన వ్యక్తిత్వంలా కనిపిస్తాయి. బ్యాడ్ బాయ్స్‌తో ఉండటం అమ్మాయిలకు ఊహించని అనుభవంగా ఉంటుంది. అమ్మాయిల ప్రవర్తనలో అనిశ్చితి, రిస్క్, థ్రిల్ ఉంటాయి. కానీ ఈ ఆకర్షణ శాశ్వతంగా ఉండదని.. జీవిత అనుభవాలు పెరిగే కొద్దీ అమ్మాయిలు భద్రత, గౌరవం కోరుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

February 22, 2026 / 09:00 PM IST

రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే..!

గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి అద్భుత ఔషదంగా పనిచేస్తుంది. ఇది BP నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే పదార్థం గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా లేదా వేయించి తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

February 22, 2026 / 08:50 PM IST

ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా?

గంటల తరబడి ఇయర్ ఫోన్స్‌ వాడితే చెవుల్లో గాలి ఆడక తేమ చేరుతుంది. దీంతో బ్యాక్టీరియా పెరిగి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అధిక శబ్దంతో వింటే శాశ్వతంగా వినికిడి శక్తి తగ్గొచ్చు. వీటిని వాడేటప్పుడు వాల్యూమ్ ఎప్పుడూ 60% కంటే తక్కువ ఉంచాలి. ప్రతి గంటకోసారి హెడ్‌ఫోన్స్‌ తీసి చెవులకు విశ్రాంతినివ్వాలి. ఇయర్ బడ్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

February 22, 2026 / 05:06 PM IST

మీ డెస్క్ శుభ్రంగా ఉందా?

వర్క్ టేబుల్ గజిబిజిగా ఉంటే, మనసు కూడా గందరగోళంగా ఉంటుంది. పని మొదలుపెట్టే ముందే డెస్క్ శుభ్రం చేసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అనవసరమైన వస్తువులను తొలగిస్తే ఒత్తిడి తగ్గి, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అంతేకాకుండా, దుమ్ము వల్ల వచ్చే అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ శుభ్రం చేయడం, వస్తువులను క్రమ పద్దతిలో ఉంచడం వంటివి చేయాలి.

February 22, 2026 / 04:06 PM IST

భార్య, భర్తల మధ్య గొడవలు.. ఇలా చేయండి!

వైవాహిక జీవితంలో గొడవలు చాలా కామన్. కానీ ఇవి ఎప్పుడో ఒకసారి వస్తేనే బాగుంటుంది. పదేపదే జరిగితే జీవితం మీద విరక్తి వస్తుంది. అందుకే భార్యభర్తల మధ్య వాదన పెరిగేకొద్ది దూరం మరింత పెరుగుతుంది. అందుకే వాదనలను పెంచకుండా ఉండండి. ఒకరి మాటను ఇంకొకరు వినండి. ఇద్దరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. పురుషులు తమ భావాలను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి.

February 22, 2026 / 02:59 PM IST

భోజనం తర్వాత సోంపు తింటున్నారా?

ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సోంపు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు నోటి దుర్వాసనను పోగొడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఔషధం.

February 22, 2026 / 02:16 PM IST

టమోటా సాస్ ఆరోగ్యానికి ప్రమాదం!

మనం స్నాక్స్ తినే టమోటా సాస్ అత్యంత ప్రమాదకరం. కంపెనీలు నో యాడెడ్ షుగర్ అని ప్రచారం చేసినా.. అది వాస్తవం కాదు. మీరు ఒక టీస్పూన్ సాస్ తింటే ఒక టీస్పూన్ చక్కెర తిన్నట్లే. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మనం తాగే పానీయాలు మన శరీరానికి తెలియకుండానే భారీ స్థాయిలో చక్కెరను అందిస్తున్నాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.

February 22, 2026 / 02:05 PM IST