PPM: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ బరోసా పింఛన్లు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం సాలూరు పట్టణం 6వ వార్డులో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.