మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అయితే, చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో వర్క్‌అవుట్‌కు దూరంగా ఉంటారు. కొందరు నెలసరి సమసంలో ఎక్స్‌ర్‌సైజ్ చేయాలా..? వద్దా..? అనే కన్ఫ్యూషన్లో ఉంటారు. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం.
పీరియడ్స్ టైమ్‌లో వ్యాయామం:
ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది సరైనదో అనుభూతి చెందండి.
అలసటగా, నీరసంగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. లేదా తక్కువ శ్రమతో కూడిన వ్యాయామం చేయండి.
ఆరోగ్యంగా అనిపిస్తే, పూర్తి వర్క్అవుట్ చేయండి.
పీరియడ్స్ టైమ్‌లో చేయగల వ్యాయామాలు:
వాకింగ్
జాగింగ్
ప్రాణాయామం
యోగా
స్ట్రెచింగ్
PMS లక్షణాలు ఉన్నవారికి:
తేలికపాటి వ్యాయామాలు మంచివి.
యోగా, స్ట్రెచింగ్, వాకింగ్ ఉపశమనం ఇస్తాయి.
బ్లీడింగ్ సరిగ్గా అయ్యేలా సహాయపడతాయి.
గుర్తుంచుకోండి:
అవసరాలకు అనుగుణంగా వ్యాయామ దినచర్యను మార్చుకోండి.
ఫిట్నెస్ రొటీన్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.