»Are You Buying An Air Cooler Follow These Precautions
Air cooler: ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఈ ఎండకాలం భారీ నుంచి తప్పించుకోవాలంటే ఏసీనో, కూలరో వాడాల్సిందే. చాలా మధ్యతరగతి వారు కూలర్ వాడుతుంటారు. అయితే దాన్ని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. దాంతో వారి అవసరాలు తీరక బాధపడుతుంటారు. అందుకే కూలర్ కొనాలి అనుకుంటున్నవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాము.
Are you buying an air cooler? Follow these precautions
Air cooler: ఎండలు మండిపోతున్నాయి. బయట వడగాల్పులు, ఇంటిలోపల ఉక్కపోత. వీటినుంచి ఉపశమనం పొందాలంటే ఏసీనో, కూలరో వాడక తప్పదు. అయితే చాలా మధ్య తరగతివారు తమ బడ్జెట్ దృష్ట్యా కూలర్ తీసుకుంటారు. కానీ దాన్ని కొనుగోలు చేయడంలో కొన్ని పొరపాట్లు చేయడం వలన వారి అవసరాలు తీరవు. అలా కాకుండా కూలర్ కొనగోలు చేయాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటంటే.. కూలర్లలో చాలా రకాలు ఉన్నాయి. చిన్న గది అయితే పర్సనల్/ టవర్ కూలర్లు బాగుంటాయి. వాటిని ఒక చోటునుంచి మరో చోటుకు తీసుకెళ్లడం సులభంగా ఉంటుంది. అలా కాకుండా గదిలో ఒకచోట పెట్టాలనుకుంటే విండో కూలర్లు తీసుకోవచ్చు. అదే పెద్ద గదులు, ఇంట్లో నలుగురైదుగురు ఉంటే మాత్రం డిజర్ట్ కూలర్లు కొనుగోలు చేయండి.
కూలర్ షాప్‌కు వెళితే ఎన్ని లీటర్ల కెపాసిటీ అని అడుగుతారు. అయితే చిన్న గది అయితే 20 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్ సరిపోతుంది. అదే పెద్ద గది అయితే 30-40 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్లు తీసుకోవడం మంచిది. అలాగే కూలర్ ప్యాడ్ విషయంలో కూడా అవగాహన ఉండాలి. తక్కువ ధర కలిగిన కూలర్లలో గడ్డితో కూడిన యాస్పెన్ ప్యాడ్ ఉంటుంది. ధర ఎక్కువ ఉన్న కూలర్లో తేనె తుట్టెను పోలిన మరో రకం హనీ ప్యాడ్ ఉంటుంది. ఇది గదిని చల్లబర్చడంలో బాగా పనిచేస్తుంది. కాస్త ఎక్కువ ధర అయినా పర్లేదు అనుకుంటే రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉన్న కూలర్ తీసుకోండి. అందులో ఉండే స్లీప్ మోడ్, స్వింగ్, కూలింగ్ ఆప్షన్స్ బాగా ఉపయోగపడుతాయి. డస్ట్ ఫిల్టర్లు ఉండే కూలర్ అయితే ఇంకా బెటర్. అలాగే చప్పుడు తక్కువగా ఉండే కూలర్ తీసుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు.