ఐపీఎల్ 2023 (IPL 2023 FInal Match) ఫైనల్ మ్యాచ్ వేదికగా ఓ పోలీసు కానిస్టేబుల్ తో ఓ మహిళ గొడవకు దిగింది. ఈ ఘటన గుజరాత్ (Gujarat) అహ్మదాబాద్ లోని (Ahmedabad) నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi stadium) జరిగింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ CSK, గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో ఓ పోలీసు అధికారికి, ప్రేక్షకురాలికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సదరు మహిళ పోలీసు అధికారితో గొడవపడి అతడిని తోసేసింది. మూడు సార్లు పోలీసును తోసేయగా అతడు ప్రేక్షకుల చైర్లపై పడ్డాడు.
CSK vs GT మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు టీంల అభిమానులు వారి ఫెవరేట్ టీంలకు మద్దతును తెలుపుతున్నారు. ఈ మధ్యలోనే పోలీసుతో మహిళ గొడవ పడింది. అక్కడ జరిగిన విషయాన్ని కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. క్షణాల్లోనే వీడియో వైరల్ అయింది. అయితే ఇరువురి మధ్య అసలు ఘర్షణ ఎందుకు మొదలైందో తెలియరాలేదు. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది మహిళదే తప్పని అంటుండగా, మరొకొందరు పోలీసును బాధ్యునిగా చేస్తున్నారు. ఏదెలా ఉన్నా… ఐపీఎల్ 2023 సీజన్ మాత్రం మాత్రం ఎట్టకేలకు పూర్తైంది.