ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (TATA IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore -RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న మ్యాచ్ లో ఉద్రేకపూర్వక ప్రవర్తన కనబర్చడంతో జరిమానా (Fine) పడగా.. తాజాగా మరో జరిమానా కోహ్లీకి పడింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals- RR)తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ఉల్లంఘనకు పాల్పడడంతో ఏకంగా రూ.24 లక్షలు జరిమానా పడింది. కోహ్లీకి ఇది రెండోసారి జరిమానా పడడం. మరోసారి ఉల్లంఘనకు పాల్పడితే ఏకంగా రెండు మ్యాచ్ (Match)లపై నిషేధం పడే ప్రమాదం ఉంది.
ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్ (RR)తో బెంగళూరు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల (IPL Code of Conduct) ప్రకారం స్లో ఓవర్ రేట్ ఉల్లంఘించిన కారణంగా కోహ్లీతోపాటు జట్టు సభ్యులందరికీ జరిమానా పడింది. ప్రస్తుత సీజన్ లో ఆర్సీబీ (RCB) స్లో ఓవర్ రేట్ ఉల్లంఘనకు పాల్పడడం ఇది రెండోసారి. రెండోసారి తప్పిదం కావడంతో కోహ్లీకి ఏకంగా రూ.24 లక్షలు, జట్టు సభ్యులకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్ లో 25 శాతం (రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది) కోత విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ (Amit Sharma) ప్రకటించారు.
మరోసారి స్లో ఓవర్ రేట్ ఉల్లంఘన చేస్తే కెప్టెన్ పై దాదాపు రెండు మ్యాచ్ ల నిషేధం (Ban) పడే ప్రమాదం పొంచి ఉంది. కాగా ఆ మ్యాచ్ లో టాస్ (Toss) గెలిచి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు (Bengalore) డుప్లెసిస్ (62) (Du plessis), మాక్స్ వెల్ (77) (Maxwell) విజృంభణతో 189 పరుగులు చేసింది. చేధనకు దిగిన రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమై ఓటమిని ఖరారు చేసుకుంది. కాగా గత మ్యాచ్ లో ఓవర్ యాక్షన్ అంటే