ఐపీఎల్ 2023కి వేలం షురూ అయ్యింది. ప్రాంఛైజీలు…ఎగబడి మరీ.. టాలెంటెడ్ క్రికెటర్లను వేలంలో పట్టేస్తున్నాయి. తాజాగా.. ఈ వేలంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కి జాక్ పాట్ తగిలింది. ఎవరూ ఊహించని ధరకు భరత్ అమ్ముడయ్యాడు. కేఎస్ భరత్ ని.. ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ దాదాపు రూ.20లక్షలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేయడం గమనార్హం.
వికెట్ కీపర్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న 29 ఏళ్ల భరత్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు కనీస ధర కన్నా చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం వెనక ఆ ఫ్రాంచైజీ మెంటార్ ఆశిశ్ నెహ్రా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత సీజన్లో యువ ఆటగాళ్లను అద్భుతంగా తీర్చిదిద్ది గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
మరోవైపు గుంటూరుకి చెందిన షేక్ రషీద్‌ను CSK జట్టు 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ విషయం తెలిసిన రషీద్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజం నేతృత్వంలో తమ కుమారుడు ఆడబోతున్నాడనే విషయం తమకెంతో ఆనందం కలిగిస్తోందని వారు తెలిపారు.