»World Record For Largest Grilled Cheese Sandwich Broken Weighs Almost 189 Kilos
Worldలోనే అతిపెద్ద చీజీ శాండ్ విచ్..ఎన్ని కిలోలో తెలుసా?
ప్రస్తుతం మనకు మార్కెట్లో చాల రకాల శాండ్ విచ్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటన్నింటిలోనూ చీజ్ శాండ్ విచ్(Sandwich)కి ఎక్కువ క్రేజ్ ఉంది. కాగా తాజాగా ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలోనే అతి పెద్ద శాండ్ విచ్ ని తయారు చేశారు.
World Record For Largest Grilled Cheese Sandwich Broken Weighs Almost 189 Kilos
అగ్రరాజ్యం అమెరికా నుంచి ఇద్దరు వ్లాగర్లు అతిపెద్ద గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్(Sandwich) తయారు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైట్ ప్రకారం, యూట్యూబర్స్ ఎక్సోడస్, ఇగ్గీ చౌదరి 100K సబ్స్క్రైబర్లను చేరుకోవడం కోసం ఈ రికార్డ్‌ను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఈ చీజీ ఫీట్‌ని సాధించడానికి వారి తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారికి సహాయం చేశారు. వారు 1.89 మీటర్లు (6.2 అడుగులు), పొడవు 3.32 మీటర్లు (10.8 అడుగులు) పొడవు, 7 సెంమీ (2.7 అంగుళాలు) మందంతో ఒక పెద్ద శాండ్విచ్ను తయారు చేయగలిగారు. GWR ప్రకారం “జెయింట్ స్లైస్‌లు ఇతర రకాల బ్రెడ్ల కంటే మెరుగ్గా వాటి నిర్మాణాన్ని నిలుపుకున్నామని వారు పేర్కొన్నారు. దిగువన ఉన్న బ్రెడ్ ‘స్లైస్’ ఓపెన్ ఫ్లేమ్స్‌పై కాల్చబడినప్పుడు పైభాగం బ్లో టార్చ్‌ని ఉపయోగించి వండుతారు. చీజ్ మొత్తం కరిగేలా, రెండు వైపులా శాండ్ విచ్ కాలేలా దీనిని తయారు చేశారు.
అయితే ఈ శాండ్ విచ్ బరువు 189.9 కిలోలుగా ఉండటం విశేషం. అధికారిక సైట్ కూడా ఈ కాల్చిన చీజ్ మునుపటి రికార్డ్ హోల్డర్ కంటే 35% పెద్దదని పేర్కొంది. వీరికంటే ముందు ఒక జర్మన్ ద్వయం ఇద్దరు వ్యక్తులు శాండ్విచ్ను అత్యంత వేగంగా తయారు చేసిన ప్రపంచ రికార్డు(World Record)ను నెలకొల్పారు. జట్టులోని ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టగా, మరొకరు చేతులు ఉపయోగించకుండా కేవలం 40 సెకన్లలో శాండ్ విచ్ తయారు చేశారు. ఇప్పుడు ఈ అమెరికా వ్లాగర్స్ అతి పెద్ద శాండ్ విచ్ తయారు చేసి రికార్డు సృష్టించారు.