రష్యాలోని ఓ మహిళ తాను దత్తత తీసుకున్న కుమారుడినే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనాథ పిల్లలకు సంగీతం నేర్పించే ఆ మహిళ అతనిని దత్తత తీసుకుంది. కొన్నేళ్లు సహజీవనంలో ఉన్న తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు.
Viral News: హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేయాలంటే తప్పకుండా వరసలు, గోత్రాలు అన్నీ చూస్తారు. పెళ్లి చేసుకునే వారు ఏదోవిధంగా అన్నాచెల్లిల్లు, అక్కాతమ్ముళ్లు అయితే ఇక వాళ్లకి పెళ్లి చేయరు. ఇలాంటి సంప్రదాయాలన్నీ మనదేశంలో పాటిస్తుంటారు. కానీ విదేశాల్లో ఎవరూ ఇలాంటి సంప్రదాయాలను పాటించరు. పెళ్లి చేసుకోవాలంటే వరసలు వంటివాటితో సంబంధం లేకుండా వాళ్ల ఇష్టప్రకారం వివాహం చేసుకుంటారు. విదేశాల్లో జరిగే ఎన్నో పెళ్లిళ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే వయస్సు ఎక్కువగా ఉన్న మహిళలను తక్కువ వయస్సున్న అబ్బాయిలు చేసుకోవడం వంటివి అక్కడ సర్వసాధారణం. కానీ ఇటీవల జరిగిన ఓ పెళ్లి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రష్యాలోని టాటర్స్తాన్కు చెందిన ఐసీలు చిజెవ్స్కాయా-మింగలిమ్ అనే మహిళ తాను దత్తత తీసుకున్న కొడుకునే వివాహం చేసుకుంది. 53 ఏళ్ల ఐసీలు.. 22 ఏళ్ల తన దత్త పుత్రుడు డేనియల్ను వివాహం చేసుకుంది. ఐసీలు అనాథ ఆశ్రమంలో సంగీతం నేర్పించేది. ఆ సమయంలో ఆమె 13ఏళ్ల బాలుడుగా ఉన్న డేనియల్ను కలిసింది. ఆ బాలుడికి సంగీతం మీద ఉండే ఇష్టాన్ని గుర్తించి.. ఆమె నేర్పించడంలో సహాయపడింది. ఆ బాలుడికి 14 ఏళ్లు వచ్చినప్పుడు ఐసీలు డేనియల్ను దత్తత తీసుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరిపై ఎప్పటి నుంచో పుకార్లు ఉన్నాయి. వాటికి స్వస్థి పలుకుతూ ఇటీవల ఇద్దరూ చట్టబద్ధంగా వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.