Video: Bride And Groom Celebrate Wedding By Skydiving
Video: జీవితంలో మధురఘట్టం పెళ్లి (marriage).. మ్యారేజ్‌ను ఒక్కొక్కరు ఒకలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. పెళ్లి జీవితకాలం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ కపుల్ (couple) ఇలాంటి సాహసమే చేసింది. పెళ్లి జరిగిన వెంటనే స్కై డైవింగ్ చేసింది. కొండ అంచు వద్దకు ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు రాగా.. స్కై డైవ్ చేసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ (viral) అవుతుంది.
ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ పెళ్లిని తీపి గుర్తుగా మలిచేందుకు ప్లాన్ చేసింది. పెళ్లి జరిగిన వెంటనే.. అదే బట్టల్లో కొండ (hill) పైకి వచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకొని స్కై డైవింగ్ చేశారు. వారు స్కై డైవ్ చేసే సమయంలో కొండ అంచున దాదాపు 20 మంది బంధువులు, సన్నిహితులు ఉన్నారు. వారిని ఎంకరేజ్ చేసి.. స్కై డైవ్‌కు పంపించారు. ఆ వీడియోను ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ఆ దంపతులు చాలా ధైర్యం చేశారని రాసుకొచ్చారు.
ఆ వీడియోకు నెటిజన్లు (netizens) కామెంట్లతో నిండిపోయింది. నిజంగా వారు చాలా ధైర్యం చేశారని ఒకరు.. థ్రిల్లింగ్‌కు గురి చేసిందని మరొకరు రాశారు. ఇదీ నిజంగా టూ మచ్ అని మరొకరు అభిప్రాయ పడ్డారు. ఈ ఫీట్ చాలా బాగుందని రాశారు. అసలు భయపడలేదని.. ధైర్య సాహసాలు ప్రదర్శించారని పేర్కొన్నారు. ఓహ్.. అని మరొకరు.. ఆ వీడియో చూసి భయం వేసిందని ఇంకొకరు రాశారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జంటపై నెటిజన్లు కామెంట్లు చేసినట్టుగా నిజంగా వారిది ధైర్యమే.. పెళ్లి జరిగిన వెంటనే హనీమూన్ వెళ్లకుండా.. అడ్వెంచర్ చేసేశారు. పలువురిని అట్రాక్ట్ చేసి వార్తల్లో నిలిచారు.