దుబాయ్ అంటే భూతల స్వర్గం అని అంటారు. ఆకాశాన్ని అంటే భవనాలు ఆ దేశం సొంతం. ఏ భవనం కట్టినా అదో ప్రత్యేకతగా ఉంటుంది. అటువంటి దుబాయ్ మరో అద్భుతమైన కట్టడాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా నీటిలో తేలియాడే మసీదును దుబాయ్ నిర్మించనుంది. ఆర్థిక సంపదలో దుబాయ్ దూసుకుపోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రపంచంలోనే తొలిసారిగా నీటిలో తేలియాడే మసీద్ నిర్మాణాన్ని నిర్మించనుంది.
సుమారు 55 మిలియన్ ధీరమ్లు అంటే సుమారుగా రూ.124 కోట్ల పెట్టుబడితో ఆ మసీదును నిర్మించనుంది. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. మూడు అంతస్థులుగా ఈ మసీదు నిర్మాణం చేపట్టనుంది. టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఆర్థిక సంపదను యూఏఈ క్రియేట్ చేస్తోంది. దీని ద్వారా ఎంతో మంది పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తోంది. చాలా మంది శ్రీమంతులు యూఏఈలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఎన్నో అద్భుత కట్టడాలతో ప్రపంచ కుబేరుల్ని ఆకట్టుకునే యూఏఈ ఆధ్యాత్మిక టూరిజాన్ని అభివృద్ధి చేసే పనిలో పడింది. అందులో భాగంగా మొదటిసారిగా దుబాయ్ వాటర్ కెనాల్లో వచ్చే ఏడాది నీటిపై తేలియాడే మసీదును నిర్మించనుంది. మూడు అంతస్థులుగా నిర్మించనున్న ఈ మసీదు మొదటి అంతస్థులో ప్రార్ధనా స్థలం ఉంటుంది. ఆ తర్వాత రెండో అంతస్థులో ఓ భారీ విస్తీర్ణంలో హాలు, మూడో అంతస్తులో ఇస్లామిక్ ప్రదర్శన శాలను నిర్మించనున్నారు.