»Tension Between Canada And India Americas Decision On Support Pentagon Official Michael Rubin
USA Support: కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తత..అమెరికా సపోర్ట్ పై నిర్ణయం!
కెనడా, భారత్ దేశాల మధ్య గత కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా మద్దతు తెలపాల్సి వస్తే ఎవరికీ తెలుపుతుంది? రెండు మిత్ర దేశాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని అక్కడి అధికారి వెల్లడించారు.
Tension between Canada and India Americas decision on support Pentagon official Michael Rubin
గత కొన్నిరోజుల నుంచి కెనడా(canada), భారత్(bharat) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా సపోర్ట్ చేయాల్సి వస్తే ఏ దేశానికి చేస్తుంది. అసలు మద్దతు ఇస్తుందా లేదా అనే అంశాలపై అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ కీలక అంశాలను వెల్లడించారు. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణల వల్ల భారతదేశం కంటే కెనడాకే “పెద్ద ప్రమాదం” ఉందని మైఖేల్ రూబిన్ అన్నారు.
అయితే అమెరికాకు రెండు కూడా మిత్ర దేశాలేనని అన్నారు. కానీ రెండు మిత్ర దేశాల మధ్య ఎంచుకోవలసి వస్తే ఒకనొక క్రమంలో ఎవరికీ కూడా సపోర్ట్ చేయకుండా ఉండే అవకాశం ఉందన్నారు. లేదా నిజ్జార్ ఉగ్రవాది అయినందున ఈ విషయంలో భారతదేశాన్ని ఎక్కువగా ఎంచుకునే అవకాశం ఉందన్నారు. ఒకవేళ ఈ వివాదం నేపథ్యంలో కెనడా లేదా భారత్ మధ్య అమెరికా ఎవరికి సపోర్ట్(support) చేస్తుందని అనుకుంటే..అది ఖచ్చితంగా రెండోది మాత్రమే అవుతుందన్నారు.
ఎందుకంటే భారత్(bharat)తో అమెరికా(america)కు సంబంధాలు చాలా ముఖ్యమైనవని గుర్తు చేశారు. కెనడా కంటే వ్యూహాత్మకంగా భారతదేశం చాలా ముఖ్యమైనదన్నారు. ఒట్టావా భారత్తో పోరాటానికి దిగడం అంటే “ఏనుగుపై చీమ పోరాడినట్లే” అని ఆయన అన్నారు. మరోవైపు కెనడా ఉగ్రవాది హత్య నేపథ్యంలో అక్కడి ప్రధాని ఇలా ఆరోపణలకు దిగదం సరికాదని, అది ఆయనకే మంచిది కాదని తెలిపారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని హోదాలో ట్రూడో ఎక్కువ కాలం కొనసాగలేరని అన్నారు. ఆయన పదవి కాలం పూర్తైన తర్వాత కెనడాతో తమ సంబంధాలను తిరిగి కొనసాగిస్తామని మైఖేల్ రూబిన్ చెప్పారు.