»Business Relations With India China Work Will End American Republican Party Leader Vivek Venkataswamy
Vivek Venkataswamy: భారత్‌తో వ్యాపార బంధం పెట్టుకుంటే చైనా పని ఖతం..
అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి.. భారత్-అమెరికా సంబంధాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైనా ఆగడాలను కట్టడి చేయాలంటే ఇండియాతో వ్యాపార సంబంధాలు బలపరుచుకోవాలని పేర్కొన్నారు.
Business relations with India China work will end American Republican Party Leader Vivek Venkataswamy
Vivek Venkataswamy: రిపబ్లికన్ పార్టీ( Republican Party) తరపున అమెరికా అధ్యక్ష(US President) ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) భారత్‌తో సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైనా(China) నుంచి అమెరికా వాణిజ్యపరమైన స్వేచ్చ పొందాలంటే భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్ రామస్వామి చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ఆయన నాలుగు అంశాలతో ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించింది.
అమెరికా ఫార్మా రంగం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్, ఇజ్రాయెల్‌తో సంబంధాలను విస్తరించాలని పేర్కొన్నారు. కంప్యూటర్ చిప్స్ తయారీ కోసం ఉపయోగించే లిథియం వంటి ఖనిజాల దిగుమతి కోసం చైనాకు బదులుగా భారత్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలను ఆశ్రయించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం ఉపయోగించే ఖనిజాల కోసం అమెరికా అధికంగా చైనాపై ఆధారపడుతోందని, అందుకు చైనాకు మంచి లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. దానికి బదులుగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన మినరల్స్‌ను భారత్, బ్రెజిల్, చిలీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని సూచించారు. చిప్స్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను పెట్టుకోవాలన్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో వివేక్ రామస్వామి దూసుకెళుతున్నారు. ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 39 శాతం మంది మద్దతుతో మొదటి స్థానంలో ఉండగా, 13 శాతం మంది మద్దతులో వివేక్ రామస్వామి రెండో స్థానంలో ఉన్నారు.