రష్యా (Russia) ఆగస్టు 11న అంతరిక్ష పరిశోధన రోస్ కాస్మోస్ ఈ ప్రయోగం చేపట్టనుంది. అయితే ఇందుకోసం రష్యా ఓ గ్రామాన్ని ఖాళీ చేయించునున్నట్లు తెలుస్తోంది.ముందు జగ్రత్త చర్యగా ప్రయోగ వేదికకు ఆగ్నేయం వైపునున్న షక్తిన్స్కీ గ్రామంలో(Shaktinsky village) ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అయితే ఈ ప్రయోగం జరుగనుంది. సొయుజ్-2 (Soyuz-2)ఫ్రిగట్ బూస్టర్‌ను మోసుకుని లూనా-25 నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే, ఈ ప్రయోగంలో రాకెట్ బూస్టర్లు(Rocket boosters).. ల్యాండర్ నుంచి విడిపోయిన తర్వాత అవి భూమిపైనే పడనున్నాయి.
ఇవి ఉమల్టా, ఉస్సామఖ్, లేపికన్, తస్తాఖ్, సగ్నార్ నదులు, బురేయా నదిలోని ఫెర్రీ క్రాసింగ్ ప్రాంతాల్లో పడే అవకాశాలున్నట్లు అంచనా వేశారు.అమెరికా, రష్యాల వారి ప్రయోగాలకు వేల కోట్లు ఖర్చు పెడితే ఇస్రో (ISRO)మాత్రం రూ.615 కోట్లతో చంద్రయాన్ 3 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగంలో ఇస్రో.. భూ గురుత్వాకర్షణ శక్తితో చంద్రుడిపై పయనించే మార్గాన్ని అనుసరిస్తోంది. చంద్రయాన్ 3 రాకెట్ భూమి చుట్టూ 170×36,500 కిలోమీటర్ల్ దీర్ఘవృత్తాకర కక్ష్యాలో ప్రవేశపెట్టారు. ఇది భూమి చుట్టూ 24 రోజులు పాటు దిగురుతూ క్రమంగా దూరంగా వెళ్తూ చంద్రుడి (moon) గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వెళ్తోంది. ఇందుకు 40 రోజలు సమయం పట్టనుంది.