Roller coaster riders stuck upside down for hours at Wisconsin festival
Roller coaster riders stuck upside down for hours at Wisconsin festival
Roller coaster riders stuck: రోలార్ కోస్టర్ (Roller coaster) ఎక్కి తిరగడం అంటే అందరికీ ఆనందమే. కొందరు ధైర్యం చేయరు. పైకి ఎక్కిన తర్వాత ఆగిపోతే ఎలా అనే భయం ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికాలో అలాంటి ఘటనే జరిగింది. విస్కాన్సిన్లో ఓ రోలర్ కోస్టర్ (Roller coaster) తిరుగుతుండగా ఆగిపోయింది. గాలిలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. వారి బాధ వర్ణణాతీతం.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
విస్కాన్సిన్లో గల క్రాండన్ వద్ద ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ జరుగుతోంది. అక్కడే రోలర్ కోస్ట్ (Roller coast) ఏర్పాటు చేశారు. తిరుగుతుండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంకేముంది ఆగగా.. గాలిలోనే 8 మంది ప్రయాణికులు 3 గంటల పాటు ఉన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మరీ ఉన్నారు. ఇటీవల ఆ రోలర్ కోస్టర్‌ను తనిఖీ చేశారని తెలిసింది. ఇంతలోనే ఆగిపోవడంతో ఏం జరిగిందనే సందేహాలు వస్తున్నాయి.
Roller coaster riders stuck upside down for hours after 'mechanical failure' at Wisconsin Festival.
The attraction at the Forest County Festival in Crandon appeared to shut down midride Sunday, leaving some riders hanging for at least three hours, according to an NBC affiliate. pic.twitter.com/0jWd8LDui6
రోలర్ కోస్టర్ (Roller coaster) ఆగడంతో ప్రయాణికులు గాలిలోనే ఉన్నారు. వారు అలా ఉండగా.. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. తర్వాత 100 ఫీట్ల ల్యాడర్ సాయంతో ఒక్కో ప్యాసెంజర్‌ను మెల్లిగా కిందకి దింపారు. చివరలో దింపే వ్యక్తి 3 గంటల పాటు వేలాడుతూ ఉన్నారు. ఇలాంటి అనుభవం తమకు గతంలో ఎదురు కాలేదని అగ్నిమాపక సిబ్బంది ఒకరు మీడియాతో తెలిపారు.
ఆదివారం ఘటన జరగగా.. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3.20 గంటలకు తొలి ప్రయాణికుడిని కిందకు దింపారు. సాయంత్రం 5.01 గంటలకు చివరి ప్యాసెంజర్‌ను దింపారు. పర్యాటకులతో వారి కుటుంబాలను కలిపించామని అధికారులు తెలిపారు. 8 మంది ప్రయాణికులకు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ విభాగంలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. సహాయక కార్యక్రమాల్లో 3 దేశాలకు చెందిన 50 మంది, 9 అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.