రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇవ్వాలని.. రూ.కోటి విలువగల రూ.2 వేల నోట్లను ఇస్తామని ఓ ముఠా మోసం చేస్తోంది. వారి వెనక ఓ పోలీస్ అధికారి ఉన్నారు. ఘటనను ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని.. సదరు అధికారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
Cheating: కొందరు ప్రబుద్దుల్లో ఎలాంటి మార్పు ఉండదు. అవును.. ఏ చిన్న వీక్నెస్ అయినా సరే తమకు అనుకూలంగా మార్చుకుంటారు. రూ.2 వేల నోటు (2k note) విత్ డ్రా చేసుకుంటాం అని.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ (rbi) గడువు విధించిన సంగతి తెలిసిందే. దానిని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బు తీసుకుంటాం అని కాదు.. రూ.2 వేల నోట్లను ఇస్తాం అని.. పెద్ద మొత్తంలో డబ్బును ఈజీని సంపాదించొచ్చు అని చెబుతున్నారు. విశాఖలో ఈ ఛీటింగ్ జరగగా.. ముఠా వెనక ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు.
రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇవ్వాలని ఆ ముఠా చెబుతోంది. బదులుగా కోటి రూపాయల విలువగల రూ.2 వేల నోట్లను ఇస్తామని అంటున్నారు. డబ్బు తీసుకొని.. ఇవ్వడం లేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రిటైర్డ్ నేవీ ఆఫీసర్లను గ్యాంగ్ (gang) మోసం చేసింది. వీరి వెనకాల ఏఆర్ సీఐ స్వర్ణలత ఉన్నారు. వారి నుంచి తీసుకున్న రూ.90 లక్షల్లో స్వర్ణలత రూ.15 లక్షలు తీసుకున్నారని తెలుస్తోంది. సీఐ స్వర్ణలత తన అనుచరులతో బాధితులను బెదిరించారని కూడా తెలిసింది.
బాధితులు కొల్లి శ్రీను (kolli srinu), శ్రీధర్ (sridhar) పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్వర్ణలతను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. స్వర్ణలత ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. తనను ఎవరూ ఏమీ చేయరనే ధీమాతో ఛీటింగ్కు పాల్పడింది. ఇప్పుడు కటకటల్లోకి వెళ్లింది.