»Rs 1 Crore Fine On Every Product If Supreme Court Warns Patanjali
Patanjali ఉత్పత్తులపై సుప్రీంకోర్టు ఆగ్రహాం.. తప్పుడు ప్రచారం ఆపకుంటే రూ.కోటి ఫైన్
పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రకటలనపై సుప్రీంకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. అలాంటి ప్రకటనలు వెంటనే ఆపాలని స్పష్టంచేసింది. లేదంటే ఒక్కో ప్రాడక్ట్‌కు రూ.కోటి జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
"Rs 1 Crore Fine On Every Product If...": Supreme Court Warns Patanjali
Patanjali: యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి (Patanjali) ఉత్పత్తులపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. పతంజలికి చెందిన హెర్బల్ ఉత్పత్తులను తప్పుగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి జనాలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడింది. తమ ఉత్పత్తులు వాడితే పలు రకాల వ్యాధులు తగ్గుతాయని చెప్పి గందరగోళానికి గురిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.
తప్పుడు ప్రకటనలు వెంటనే ఆపాలని తేల్చిచెప్పింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని జస్టిస్ అమానుల్లాహ్, ప్రశాంత్ కుమార్ మిత్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం రోజున విచారణ చేపట్టింది.
తమ ఉత్పత్తి వాడితే రోగం నయం అవుతుందని ప్రకటన ఆపాలని.. లేదంటే కంపెనీ చెప్పిన వ్యాధి నయం కాకుంటే.. ఒక్కో ఉత్పత్తి రూ.కోటి చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. తప్పుడు ప్రకటన ఇచ్చినందుకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది.
వ్యాక్సిన్, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా రామ్‌దేవ్ బాబా (Ramdev baba) దుష్ప్రచారం చేస్తున్నారని ఐఎంఏ గతంలో కూడా పిటిషన్ వేసింది. గతేడాది ఆగస్ట్ 23వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించగా వెంటనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్, పతంజలి (Patanjali) ఆయుర్వేద్ లిమిటెడ్‌కు అప్పుడే ధర్మాసనం నోటీసులు జారీచేసింది. పతంజలికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయొద్దని ఆ రోజు స్పష్టంచేసింది.