Nushrratt Bharuccha: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అంతకుముందే హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు హీరోయిన్ నుస్రత్ భరూచా (Nushrratt Bharuccha) తన టీమ్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. యుద్ధం స్టార్ట్ కావడంతో ఇజ్రాయెల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సైట్ చూడటానికి వెళ్లిన భరూచాకు టీమ్‌తో కమ్యూనికేషన్ నిలిచిపోయింది. దీంతో భరూచా టీమ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. ఎంబసీ అధికారులు చొరవ తీసుకున్నారు. భరూచా (Nushrratt Bharuccha) ఎక్కడ ఉందో తెలిసింది. ఆమెతో ఫోన్లో మాట్లాడమని.. క్షేమంగా ఉందని టీమ్ చెబుతోంది. నుస్రత్ భరూచాను (Nushrratt Bharuccha) ఇండియా పంపించే ఏర్పాట్లు చేశామని ఎంబసీ అధికారులు వివరించారు. ముంబై బయల్దేరారని.. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నాం 2 దిగుతారని తెలిపారు. దీంతో ఆమె టీమ్, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
నిన్న మధ్యాహ్నం 12.30 గంటల వరకు టచ్‌లో ఉన్నారని.. తర్వాత సమాచారం లేదని పేర్కొన్నారు. నుస్రత్ (Nushrratt) తెలుగులో శివాజీ సరసన తాజ్‌మహల్ మూవీలో నటించారు. బాలీవుడ్లో 25 సినిమాలు చేశారు. నుస్రత్ నటించిన అకెల్లి సినిమాలో ఇలాంటి ఘటన ఉంటుంది. ఓ ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడేందుకు సాధారణ భారతీయ అమ్మాయి రోల్ పోషించారు. రియల్ లైఫ్‌లో కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు.