Jagapathi Babu: టాలీవుడ్ నటుడు, ఇటీవల విలన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకుంటున్న జగపతి బాబు (Jagapathi Babu) ఎమోషనల్ అయ్యారు. అభిమాన సంఘాలు, ట్రస్ట్ పేరుతో ఆశించే వారు ఎక్కువ అయ్యారని బాధపడ్డారు. తన నుంచి డబ్బులు ఆశించడం ఎక్కువయ్యిందని.. ఇక వాటికి గుడ్ బై చెబుతున్నానని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఏం రాశారంటే..
అందరికీ నమస్కారం అంటూ లేఖ స్టార్ట్ చేశారు జగపతి బాబు (Jagapathi Babu). గత 33 ఏళ్లుగా తన కుటుంబ శ్రేయోహభిషులాగా ఉన్నారు. తన ఎదుగుదలకు ముఖ్య కారణం అయ్యారు. ప్రతీ ఒక్క అభిమాని కుటుంబ విషయాల్లో పాల్గొని కష్ట నష్టాలను విని.. తోడుగా ఉన్నానని చెప్పారు. అభిమానం, ప్రేమ ఇచ్చేవాళ్లు ఫ్యాన్స్ అని మనస్ఫూర్తిగా నమ్మాను.. విశ్వసించాను అని తెలిపారు.
బాధకరమైన విషయం అంటూ అసలు విషయం చెప్పేశారు. కొందరు అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. తనను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెబుతున్న అంటూ.. ఇక నుంచి అభిమాన సంఘలకు, ట్రస్ట్‌కి సంబంధం లేదు. ఆ బంధాన్ని విరమించుకుంటున్నానని జగపతి బాబు ప్రకటన చేశారు. ప్రేమించే అభిమానులకు మాత్రమే తోడుగా ఉంటానని వివరించారు. ఇకనైనా తనను జీవించనివ్వండి.. మీరు జీవించండి అంటూ ఘాటు వ్యాఖ్యలతో లేఖను ముగించారు.
హీరో అంటే అభిమాన సంఘాలు ఏర్పాటు చేస్తారు. మూవీ రిలీజ్.. లేదంటే హీరో బర్త్ డే రోజున సెలబ్రేట్ చేస్తారు. రక్తదానం, అన్నదానం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అందుకోసం డబ్బులు అడుగుతుంటారు.. ఇన్ని రోజులు ఇచ్చి ఇచ్చి విసుగుచెందారో ఏమో.. ఇక వీడ్కోలు పలికారు. అగ్ర నటులు అయితే కోట్లలో నగదు ఉంటుంది.. జగపతిబాబు పరిస్థితి మారిపోయింది. ఉన్న ఇల్లునే అమ్మేసి మరో చోట ఉంటున్నారు. సినీ రంగంలో కెరీర్ చివరి దశలో ఉన్నా జగపతిబాబు.. ఇక కఠిన నిర్ణయం తీసుకున్నారు.