»Dhonis 42nd Birthday Huge Cutout In Hyderabad And Nandigama
Dhoni: ధోనీ బర్త్ డే..హైదరాబాద్‌లో భారీ కటౌట్
ఈరోజు(జులై 7న) MS ధోని 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ హైదరాబాద్‌లో 52 ఫీట్ల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏపీలో సైతం 77 ఫీట్ల కటౌట్ ను ఏర్పాటు చేశారు.
ఎంఎస్ ధోని(Dhoni) బర్త్ డే ఈరోజు(జులై 7). ఈ సందర్భంగా ధోని ఫ్యాన్స్ సోషల్ మీడియా వైదికగా తెగ పోస్టులు చేస్తు సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ధోని ఫ్యాన్స్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 42 ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ వద్ద 77 అడుగుల కటౌట్ సిద్ధం చేశారు. ధోనీ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ భారీ కటౌట్లను ఏర్పాటు చేయడం ప్రస్తుతం పలువురిని ఆకర్షిస్తుంది. ధోని 42వ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది అభిమానులు, ప్రముఖులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఏర్పాటు చైసిన బ్లూ కటౌట్లో ధోని ఇండియన్ జెర్సీని ధరించి, అతని చేతిలో బ్యాట్‌ను గట్టిగా పట్టుకున్నట్లు ఉంది. ధోని ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి ఐదవ IPL టైటిల్‌ను గెల్చుకున్నారు. అంతర్జాతీయ రంగంలో దాదాపు 15 ఏళ్ల కెరీర్‌తో MS ధోని ఆశించదగిన ట్రోఫీలు, అనేక మంది అభిమానులు, ప్రశంసలను దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా అతని పదవీకాలం 2007లో ప్రారంభ T20 ప్రపంచ కప్‌లో భారత T20I జట్టును విజయపథంలో నడిపించింది. ధోని అసాధారణ నాయకత్వ నైపుణ్యాలు 2011 ODI ప్రపంచ కప్‌లో మెన్ ఇన్ బ్లూ విజయానికి దారితీశాయి ఆ తర్వాత ICCలో విజయం సాధించారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని సైతం గెల్చుకున్నారు.
Thala retired 3 years ago, but the craze is still the same!🙇🏻♂️
Tallest cutouts ever for a Cricketer ▪︎52 feet cutout at Hyderabad, Telangana ▪︎77 feet cutout at Nandigama, Andhra Pradesh