భార్యభర్తల గొడవ ఉంటే ఇంట్లో చూసుకోవాలి లేదా కోర్టులో చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తి బార్ వద్ద చూపించాడు. అది తన వైఫ్పైన కాదు. ఆమె మీద కోపంతో సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
Retired Police officer who opened fire at a bar in California, USA, was angry with his wife
Viral News: అమెరికాలో(USA) ఓ దారుణం చోటుచేసుకుంది. భార్యమీద కోపంతో ఒక వ్యక్తి పబ్లిక్పై కాల్పులు జరిపాడు. కాలిఫోర్నియా (California)లోని ఆరెంజ్ కౌంటీలోని బైకర్స్ బార్ ఒక భార్య బాధితుడు ఈ ఘోరానికి తెగబడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సమయంలో జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అప్పటికి ఆ దుండగుడు కాల్పులు విరమించకపోవడంతో పోలీసులు కూడా ఫైరింగ్ మొదలు పెట్టారు. ఎదురుకాల్పుల్లో నిందుతుడు మరణించినట్లు, అతను రిటైర్డ్ పోలీసు అధికారి అని అమెరికా (America) మీడియా కథనాలు తెలిపాయి.
సాధారణంగా నేటి సమాజంలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. భార్యభర్తల నడుమ గొడువ అయింది. ఆమె తనను కొన్నాళ్లనుంచి దూరం పెట్టడంతో ఫ్రెస్టేషన్కు గురి అయ్యాడు. దాంతో తనను ఏం అనేలేక ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో కూరుకుపోయాడు. దాంతో తాగిన మత్తులో సామాన్యులపై విరుచుకుపడ్డాడు. ఈ వార్త చదువుతుంటే ఎక్కడో చూసినట్లు, విన్నట్లు అనిపిస్తుంది కదా.. ఈ మద్యే పార్ థాజిల్ అనే తమిళ్, తెలుగు సినిమా వచ్చింది. అందులో కూడా మెయిన్ విలన్ వైఫ్‌పై ఫ్రెస్టేషన్‌తో సీరియల్ కిల్లర్‌గా మారుతాడు. వరుసగా ఆడవారిని హత్యలు చేస్తుంటాడు. తమిళ నటుడు శరత్ కుమార్ నటించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా విషయం కాసేపు పక్కన పెడితే.. నిజ జీవితంలో భార్యలు చేసు పనులు భర్తలపై మైండ్ సెట్‌ను క్రిమినల్‌గా మార్చే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ అధ్యాయనాలు కూడా పేర్కొన్నాయి. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. మనసు కుదటపడకపోతే వేద్యుడిని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలని ఆయా అధ్యాయనాలు వెల్లడించాయి.