వరంగల్(Warangal)లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. అఖిల్ బార్లో ఫుల్‌గా మందు తాగాడు. తనకు ఇంకా మందు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ, బార్ క్యాషియర్ (Cashier) అందుకు నిరాకరించాడు. అప్పటి వరకు తాగిన మద్యం తాలూకు డబ్బులు చెల్లించాలని అన్నాడు. దీంతో మధు ఆగ్రహంతో ఊగిపోయాడు. బార్ క్యాషియర్‌తో వాదనకు దిగాడు. అనంతరం, మధు (Madhu) ఆ బార్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. కొంత సేపటికి మళ్లీ బార్‌కు ఓ తల్వార్ (Talwar) చేత పట్టుకుని వచ్చాడు.
తనకు ఫుల్ బాటిల్ కావాలని తల్వార్‌తో బెదిరిస్తూ అడిగాడు. దీంతో బార్ నిర్వాహకులు, అక్కడే ఉన్న మరికొందరూ ఆందోళనకు గురయ్యారు. బార్ (BAR) నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వేగంగా స్పాట్‌కు వచ్చేశారు. కానీ, ఆ మధు పోలీసులనూ బెదిరించాడు. ఫుల్ బాటిల్ ఇస్తేనే తిరిగి వెళ్లిపోతానంటూ షరతుపెట్టాడు. పోలీసులు (Police) అతడిని తమ మార్గంలోకి తెచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి విసుగు చెందారు. దీంతో మధును మాటల్లో ఉంచి అదుపులోకి తీసుకున్నారు.మధు గతంలో ఆటో డ్రైవర్ పని చేసేవాడు. ప్రస్తుతం కొబ్బరి బోండాల వ్యాపారం (Business) చేస్తున్నాడు. ఇది వరకే మధుపై రౌడీ షీట్ ఓపెన్ అయిందని పోలీసులు వెల్లడిచారు.