మనిషి తన స్వార్ధం కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. పట్టరాని కోపం, అసహనం వల్ల చిన్నచిన్న కారణాలకే పగను పెంచుకుంటున్నారు. మారణాయుధాలతో దారుణాలకు దెగబడుతున్నారు. తాజాగా చెన్నైలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. బిర్యానీ కోసం ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటనలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
చెన్నైలో బాలాజీ(22) అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి బిర్యానీ తినాలనుకున్నాడు. అందులో భాగంగా బిర్యానీ తినేందుకు మన్నూరుపేటకు వెళ్లి ఆ షాపులో బిర్యానీ ఆర్డర్ చేశాడు. అదే టైంలో అక్కడికి కొందరు తాగుబోతులు కూడా వచ్చారు. వారు కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టడమే కాకుండా బాలాజీతో గొడవపడ్డారు. అసలే ఫుల్లుగా తాగున్నవారు మద్యం మత్తులో రెచ్చిపోయి బాలాజీపై దాడి చేశారు. అక్కడికక్కడే వేటకొడవళ్లతో నరికి చంపేశారు.
నడిరోడ్డుపై ఇంత దారుణం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. వాహనదారులు తమకేమీ తెలియదన్నట్లుగా వెళ్లిపోయారు. ఒక్కరు కూడా ఆ హత్యను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసీఫుటేజ్ ఆధారంగా హత్య చేసిన వారిని శంకర్, అజిత్, వెంకట్‌గా పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.