»Heavy Fine If Drunk And Vomit Vomit Fee Charged In Restaurant
Restaurant Vomit Fees: తాగి వాంతి చేసుకుంటే భారీ జరిమానా..రెస్టారెంట్లో ‘వామిట్ ఫీజు’ వసూలు
మందుబాబులకు వార్నింగ్..ఇక రెస్టారెంట్లో తాగి వాంతి చేసుకుంటే వామిట్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వాంతి చేసుకున్నవారికి రెస్టారెంట్ భారీ జరిమానాను విధించనుంది. ఈ కొత్త రూల్ తీసుకురావడంతో మందుబాబులు షాక్ అవుతున్నారు.
మందుబాబులకు రెస్టారెంట్లు (Restaurants) షాకిస్తున్నాయి. కొత్త కొత్త రూల్స్ (New Rules) తెచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నాయి. చాలా మంది మందుబాబులు (Drinkers) పీకల దాకా తాగడం ఆ తర్వాత కక్కటం చేస్తుంటారు. బారుల్లో, పబ్బుల్లో ఇటువంటివి చేయడం ఎక్కువైపోయింది. ఇలా తాగింది కక్కటం ద్వారా దాన్ని శుభ్రం చేసేందుకు సిబ్బంది చికాకు పడుతున్నారు. అందుకే బార్ అండ్ రెస్టారెంట్ ఓ వినూత్న నిబంధనను తీసుకొచ్చింది. తాగండి కానీ ఇక్కడ వాంతి చేసుకోకండని వార్నింగ్ ఇచ్చింది. ఒక వేళ వాంతి చేసుకుంటే మాత్రం భారీ జరిమానా (Fine) కట్టాల్సిందేనని రూల్ తీసుకొచ్చింది.
అమెరికా (America)లోని కాలిఫోర్నియా (California)లో ఓ రెస్టారెంట్ ఈ కొత్త రూల్ తీసుకురావడంతో మందుబాబులు ముక్కున వేలేసుకుంటున్నారు. మద్యం తాగి వాంతి చేసుకుంటే 50 డాలర్లు జరిమానా వేయనున్నట్లు ఆ రెస్టారెంట్ తెలిపింది. 50 డాలర్లు అంటే భారత కరెన్సీలో 4 వేల రూపాయలకు పైనే కావడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగిన తర్వాత వాంతి చేసుకోవడం సహజమేనని మద్యం ప్రియులు వాదిస్తున్నారు.
శాన్ఫ్రాన్సిస్కో (San Fransisco) నగరంలోని 16వ స్ట్రీట్ కిచెన్ స్టోరీ అనే రెస్టారెంట్లో కూడా ఈ నిబంధన అమలులోకి వచ్చింది. జరిమానా కట్టకూడదనుకుంటే లిమిట్‌గా తాగి ఇంటికి వెళ్లాలని ఆ రెస్టారెంట్ యాజమాన్యం మందుబాబులకు సూచిస్తోంది. డబ్బులు కన్నా పరిశుభ్రత ముఖ్యం అని, రెస్టారెంట్ ఆవరణలో కస్టమర్లు చెత్త వేసినా, వాంతి చేసుకున్నా జరిమానా తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఇలా చేయడం వల్ల మందుబాబులతో పాటుగా యాజమాన్యానికి కూడా చాలా మేలు జరుగుతుందని చెబుతోంది.