»Former Miss World Contestant Sherika De Armas Dies At The Age Of 26
Sherika De Armas: మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ షెరికా డి ఆర్మాస్ కన్నుమూత
మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ ఇక లేరు. 2015 లో మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు తను ప్రాతినిధ్యం వహించింది. షెరికా రెండేళ్లుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతోంది.
Sherika De Armas: మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ ఇక లేరు. 2015 లో మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు తను ప్రాతినిధ్యం వహించింది. షెరికా రెండేళ్లుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతోంది. దీంతో ఆమెకు కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్స అందించారు. 2023 అక్టోబర్ 13న 26 ఏళ్ల వయసులో షెరికా ఈ యుద్ధంలో ఓడిపోయింది. షెరికా డి అర్మాస్ మరణ వార్త విన్న తన అభిమానులు సంతాపం ప్రకటించారు.
2015లో చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో షెరికా డి అర్మాస్ టాప్ 30లో ఎంపిక కాలేదు. కానీ ఆ పోటీలో ఉన్న ఆరుగురు 18 ఏళ్ల పోటీదారులలో ఒకరు. ఆ సమయంలో షెరికా ఒక ఇంటర్వ్యూలో .. “నేను ఎప్పుడూ మోడల్ కావాలని కోరుకుంటున్నాను, అది బ్యూటీ మోడల్ అయినా, యాడ్ మోడల్ అయినా లేదా క్యాట్‌వాక్ మోడల్ అయినా. నేను ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రతిదాన్ని ప్రేమిస్తున్నాను. అందుకు అవసరమైనా ఏ అవకాశాన్నైనా వదులుకోను. దీన్ని పొందడం ఏ అమ్మాయికైనా కల అని నేను భావిస్తున్నాను. సవాళ్లతో నిండిన ఈ అనుభవాన్ని జీవించగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది.
షెరికా డి అర్మాస్ తన సొంత మేకప్ లైన్‌ను కూడా ప్రారంభించింది. షెరికా పేరుతో స్టూడియోను ప్రారంభించడం గమనార్హం. ఇది కాకుండా, ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్‌తో కూడా అనుబంధం కలిగి ఉంది.