SBI Customer Alert: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ కోట్లాది మంది ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. వాస్తవానికి ఎస్బీఐ యూపీఐ సేవ గత 3 రోజులుగా పని చేయడం లేదు. దీని కారణంగా బ్యాంకుకు చెందిన కోట్లాది మంది UPI వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల, బ్యాంక్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో తమ UPI సిస్టమ్ కొంచెం బలహీనంగా ఉందని.. దాని ద్వారా చెల్లింపులు చేయడంలో ప్రజలు ఇబ్బంది పడవచ్చని తెలియజేసింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు UPI వ్యవస్థ ఎందుకు పని చేయడం లేదో తెలుసుకుందాం.
UPI ఎందుకు పని చేయడం లేదు?
దీనికి కారణాన్ని ఎస్బీఐ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విటర్లో తెలిపింది. ప్రస్తుతం సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉన్నామని చెప్పింది. దీని వల్ల కొన్నిసార్లు UPI సేవలో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి అప్ గ్రేడ్ వర్షన్ త్వరలోనే అందిస్తామని వెల్లడించింది. కస్టమర్లు శనివారం నుండి UPIని ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
బ్యాంకులు నిర్ణీత వ్యవధిలో షెడ్యూల్ చేసిన కార్యకలాపాలను పూర్తి చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. బ్యాంకులు పనిచేయట్లేదన్న విషయం ముందుగానే చెప్పడం. దీని వల్ల కస్టమర్లు ముందుగానే అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి కస్టమర్లకు సమయం లభిస్తుంది. చాలా మంది వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 14, 2023న 00:40 నుండి 02:10 వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ సర్వీస్ అందుబాటులో ఉండదని బ్యాంక్ మెసేజ్‌లో పేర్కొంది. UPI చెల్లింపు సేవ కోసం SBI ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉపయోగించబడుతున్నాయి.