»Wpi Negative For Sixth Time In September 2023 Will Rbi Target Be Reached
Wpi inflation: ఆరోసారి టోకు ద్రవ్యోల్బణం నెగిటివ్..RBI లక్ష్యం చేరుతుందా?
సెప్టెంబర్లో వరుసగా ఆరవ నెలలో భారతదేశ టోకు ద్రవ్యోల్బణం(WPI) ప్రతికూల స్థాయిలోనే నమోదైంది. సెప్టెంబర్లో టోకు ధరల సూచీ (WPI) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.26 శాతం క్షీణించింది. అయితే తగ్గడానికి గల కారణాలెంటో ఇప్పుడు చుద్దాం.
Wpi negative for sixth time in september 2023 Will RBI target be reached
భారతదేశంలో టోకు ద్రవ్యోల్బణం(WPI) మళ్లీ ఆరోసారి నెగెటివ్లోకి చేరింది. సెప్టెంబర్ నెలలో ఆరో సారి ప్రతికూల జోన్లో కొనసాగిందని అధికారిక డేటా వెల్లడించింది. అయితే ఆహార వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా టోకు ధరల సూచీ (-)0.26 శాతానికి చేరినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది నెగిటివ్లో కొనసాగుతుంది. అదేవిధంగా కోవిడ్ ప్రారంభ రోజులలో జూలై 2020లో, WPI ప్రతికూలంగా నమోదైంది. సెప్టెంబరు టోకు ద్రవ్యోల్బణం ఆగస్టులో (-) 0.52%కి వ్యతిరేకంగా (-) 0.26% వద్ద, జూలైలో (-) 1.23%కి వ్యతిరేకంగా వచ్చిందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.
అయితే సెప్టెంబరులో ద్రవ్యోల్బణం ప్రధానంగా రసాయన, ఖనిజ నూనెలు, వస్త్రాలు, ప్రాథమిక లోహాలు, ఆహార ఉత్పత్తుల ధరలు గతంతో పోలిస్తే తగ్గడం వల్ల మార్పు వచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. అయితే ఇది దేశ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉంది. వడ్డీ రేట్ల తగ్గింపును పరిగణనలోకి తీసుకునే ముందు ఈ లక్ష్యాన్ని సాధించడం కీలకమని ఆర్బిఐ సంకేతాలు ఇచ్చింది. తన ఇటీవలి పాలసీ సమావేశంలో, ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకురావాలనే లక్ష్యంతో వరుసగా నాలుగోసారి తన కీలక రుణ రేటును స్థిరంగా ఉంచాలని RBI నిర్ణయించింది.