»Plz Tell Covid Origins Who Chief Asked To Countries
Covid origins:కరోనా మూలం చెప్పండి.. దేశాలకు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ సూచన
Covid origins:కరోనా వైరస్ (coronavirus) రక్కసి ప్రపంచాన్ని వణికించింది. 2019లో వచ్చిన వైరస్.. రెండేళ్లు గడగడలాడించింది. వైరస్ (virus) వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలి తీసుకుంది. అయితే వైరస్ పుట్టుక ఇప్పటికే సందేహామే.. చైనాలో (china) గల వుహాన్ (vuhan) సైన్స్ ల్యాబ్లో వైరస్ ఆవిర్భవించిందనే ప్రచారం జరిగింది. దానిని నిరూపించే సాక్ష్యాలు మాత్రం ఏమీ లేవు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా వైరస్ (virus) మూలం గురించి తెలియజేయాలని కోరింది.
plz.. tell Covid origins WHO chief asked to countries
Covid origins:కరోనా వైరస్ (coronavirus) రక్కసి ప్రపంచాన్ని వణికించింది. 2019లో వచ్చిన వైరస్.. రెండేళ్లు గడగడలాడించింది. వైరస్ (virus) వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలి తీసుకుంది. అయితే వైరస్ పుట్టుక ఇప్పటికే సందేహామే.. చైనాలో (china) గల వుహాన్ (vuhan) సైన్స్ ల్యాబ్లో వైరస్ ఆవిర్భవించిందనే ప్రచారం జరిగింది. దానిని నిరూపించే సాక్ష్యాలు మాత్రం ఏమీ లేవు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా వైరస్ (virus) మూలం గురించి తెలియజేయాలని కోరింది. దాని మూలం తెలిస్తే భవిష్యత్లో మరింత జాగ్రత్తగా ఉండొచ్చని.. ఈ స్థాయిలో ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడింది.
‘కరోనా వైరస్ (coronavirus) మూలం గురించి మీకు తెలిస్తే చెప్పండి. ఆ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు (WHO) ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటికీ తెలియజేయాలని కోరింది. దీనిపై ఒకరిని నిందించేందుకు కాదని సూచించింది. మహమ్మారి ఎలా మొదలైందో తెలుసుకుని, అవగాహన పెంచుకోవడం మంచిదని తెలిపింది. దీనితో భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుంటుందని పేర్కొంది. వైరస్ బారి నుంచి ఎలా బయటపడాలనే అంశంపై శ్రద్ద వహించాలని కోరింది. ఇప్పడు మనం జాగ్రత్తగా ఉంటేనే భవిష్యత్లో ఇతర వైరస్ల పుట్టుకను నివారించొచ్చు. కోవిడ్ మూలాలను తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వదిలిపెట్టబోదని’ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రేయెసెస్ తెలిపారు.
కరోనా వైరస్ వుహాన్ (vuhan) వైరాలజీ ల్యాబ్లో ఆవిర్బవించిందని అమెరికా చెబుతోంది. ఇదే విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ డైరెక్టర్ (fbi director) క్రిస్టోఫర్ రే స్పష్టంచేశారు. కరోనా మహమ్మారి మూలం గురించి ఎఫ్బీఐ సమాచారం సేకరించిందని పేర్కొన్నారు. వుహాన్ ల్యాబ్లో (vuhan lab) పుట్టిందేనని తేల్చిచెప్పారు. 2019 చివరలో వుహాన్లో కరోనా మహమ్మారి మొదలైన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మిగతా దేశాలకు పాకింది. ఇటు ఎఫ్బీఐ చీఫ్ (fbi chief) ప్రకటనను చైనా కొట్టిపారేసింది. తమపై కావాలనే నిందలు వేస్తున్నారని ఖండించింది. తమ దేశంపై వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారం అని ఆగ్రహాం వ్యక్తంచేసింది.
అమెరికా (america), చైనాల (china) మధ్య పొసగడం లేదు. రెండు అగ్రదేశాల మధ్య స్పై బెలూన్ అంశంతో మరింత విభేదాలు పొడచూశాయి. ఇదే కాక పలు విషయాల్లో ఆ రెండు దేశాల మధ్య డిఫరెన్స్ ఉన్నాయి. చైనా స్పై బెలూన్ను అమెరికా కూల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను డ్రాగన్ చైనా ఖండించింది. తమకు చెప్పి ఉండాల్సిందని పేర్కొంది.