అగ్రరాజ్యం అమెరికాలోని నెవాడా(nevada)ఎడారిలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బ్లాక్ రాక్ ఎడారిలో ఏర్పాటు చేసిన బర్నింగ్ మ్యాన్ వేడుక(Burning Man festival)లో భాగంగా భారీ వర్షానికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున బురద ఆ ప్రాంతానికి కొట్టుకొచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న 73 వేల మంది అక్కడి నుంచి బయటకొచ్చేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
పాకిస్థాన్ లో ఓ వివాహ వేడుకలో విందు జరుగుతున్న సమయంలో అతిథుల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కుర్చీలు మడతపెట్టి కొట్టుకునే వరకు వెళ్లింది
చైనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే రష్యాను, చైనా నుంచి దూరం చేయాలని రామస్వామి అభిప్రాయపడ్డారు.
మొన్న టమాలు.. తర్వాత ఉల్లిగడ్డలు.. ఇప్పుడు పెట్రోలియం(petrol), డీజిల్ ధరలు(diesel price) భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.305కు చేరింది. అయితే ఈ రేట్లు మన పక్క దేశమైన పాకిస్తాన్లో కొనసాగుతున్నాయి.
తప్పుడు సమాచారం ఇచ్చే యూట్యూబర్లపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఆ వీడియోలను ప్లాట్ పామ్ మీద నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా 64 లక్షల వీడియోలను రీమూవ్ చేసింది.
ట్విట్టర్‌లో ఇకపై ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ పట్టణంలో భారీ అగ్నీ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 200 మంది నివసించే ఓ అపార్ట్‌మెంట్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కళ్లు మూసి తెరిచేలోగా చుట్టు మంటలు వ్యాపించడంతో 60 మందికిపైగా మృత్యువాత చెందారు.
ప్రపంచ వ్యాప్తంగా హిజాబ్ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఇండోనేషియాలో హిజాబ్ సరిగా ధరించలేదని 14 మంది బాలికలకు స్కూల్ టీచర్ గుండు చేయించాడు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఓ ఇద్దరు మహిళలు తాము పెంచుకునే చిలుకను చిత్రహింసలు పెట్టి చంపారు. ముద్దుగా మాట్లాడే ఆ చిలుకను అత్యంత పాశవికంగా హతమార్చారు. దీంతో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది.
ఇటీవల బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. ఇది మాత్రమే కాదు, కొంతకాలం క్రితం సరిహద్దు సమస్యకు సంబంధించి 19 రౌండ్ల కమాండర్ స్థాయి చర్చ జరిగింది. కొన్ని రోజుల తర్వాత చైనా ఢిల్లీలో జరిగే G-20 సదస్సుకు హాజరు కానుంది. కాగా, మాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ ఇమేజ్ ద్వారా చైనా కొత్త కుట్ర బయటపడింది.
ప్రజ్ఞాన్ రోవర్ స్మైల్ ప్లీజ్ అంటూ విక్రమ్ ల్యాండర్ ఫోటోలను తీసింది. ఆ ఫోటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అవుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో హంగేరి ప్రధాన మంత్రి ట్రకర్ ఓ అంతార్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్ష పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బైడెన్ వెస్ట్ అనే విధంగా వ్యాఖ్యానించారు.
ఈరోజు (ఆగస్టు 30న) రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం "బ్లూ సూపర్‌మూన్(super blue moon)" కనువిందు చేయనుంది. దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే ఈ అరుదైన దృగ్విషయం నిజంగా చూడదగ్గదని చెప్పవచ్చు. సూపర్ బ్లూ మూన్ కొంచెం పెద్ద పరిమాణంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సాధారణ పౌర్ణమి కంటే సూపర్‌మూన్‌లు దాదాపు 40% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
యువతులు తగిన వయసులో పెళ్లి చేసుకుని.. పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు చాంగ్షాన్ కౌంటి ఈ నగదు ప్రోత్సహకాన్ని తీసుకొచ్చింది
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ సైనికుల్లో 700 మందికిపైగా హతమార్చినట్లుగా రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.