ట్విట్టర్ (Twitter) సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) తమ యూజర్లకు శుభవార్త చెప్పారు. గతేడాది ప్రకటించినట్లుగానే ట్విట్టర్ 2.0 ప్రోగ్రామ్స్‌ను వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్లో మస్క్ సరికొత్త మార్పులు చేస్తున్నారు. తాజాగా మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు రాబోతున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్లో త్వరలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు మెసేజెస్ చేసుకునే ఫీచర్స్ అందుబాటులోకి రానున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ట్విట్టర్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ఏ ట్విట్టర్ యూజర్‌కైనా ఇకపై నేరుగా మెసేజ్ చేయొచ్చని, ఎమోజీలు కూడా వాడుకోవచ్చని తెలిపారు.
త్వరలో ట్విట్టర్ నుంచి ట్విట్టర్‌కు ఆడియో కాల్స్ (Audio calls) లేదా వీడియో కాల్స్ (Video Calls) కూడా అందుబాటులోకి రానున్నట్లు మస్క్ ప్రకటించారు. ఆడియో, వీడియో కాల్స్‌కు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒక ట్విట్టర్ యూజర్ నుంచి మరో ట్విట్టర్ యూజర్‌కు డైరెక్ట్ కాల్స్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడివాళ్లకైనా ఇలా కాల్ చేసుకునే సదుపాయం ఉంటుందన్నారు. ఇలాంటి ఫీచర్లు ఇప్పటికే మెటాకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయని, ట్విట్టర్ మెసేజెస్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయని తెలిపారు.
అయితే ట్విట్టర్ ద్వారా చేసే కాల్స్ కూడా ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయా లేకుంటే ఉండవా అనే విషయాలను ఆయన వెల్లడించలేదు. ఎన్క్రిప్టెడ్ అంటే యూజర్‌కు, యూజర్‌కు మధ్య మరొకరు కాల్స్ వినడం, లేదా మెసెజేస్ చదవడం వంటివి జరిగే అవకాశం ఉంది. కంపెనీకి వీటిపై ఎలాంటి యాక్సెస్ ఉండదని యూజర్లు గ్రహించాలి. ట్విట్టర్లో లాంగ్ ఫామ్ మెసేజెస్, పేమెంట్స్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయని ఎలాన్ మస్క్ (Elon Musk) తెలిపారు.