»At Least 58 People Killed In Fire In Block Of Flats In Johannesburg South African Authorities Say
Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం..63 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ పట్టణంలో భారీ అగ్నీ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 200 మంది నివసించే ఓ అపార్ట్మెంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కళ్లు మూసి తెరిచేలోగా చుట్టు మంటలు వ్యాపించడంతో 60 మందికిపైగా మృత్యువాత చెందారు.
At least 58 people killed in fire in block of flats in Johannesburg, South African authorities say
Fire hazard: దక్షిణాఫ్రికాలో(South Africa)ని జోహన్నెస్‌బర్గ్( Johannesburg) పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం(Fire hazard) జరిగింది. ఈ ప్రమాదంలో దాదాను 63 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వందలాది మంది నిరాశ్రయులుగా మారారు. గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికి 43 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని అధికార ప్రతినిధి రాబర్ట్ ములాడ్జీ తెలిపారు. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గత 20 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు చూడలేదని అధికారులు అంటున్నారు.
విషయం తెలుసుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనం నుంచి ఇప్పటివరకు 58 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అదికారులు తెలిపారు. అయతే భవనం లోపల ఇంకా ఎక్కువ మంది చిన్నారులు ఉండే అవకాశం ఉందన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని.. కానీ భవనం మొత్తం నల్లగా, పొగతో నిండి ఉండడం వల్ల గదుల్లో అనేక మంది కనిపించడం లేదని చెప్పారు. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.