»Bjp Is Hiding The Facts 7 5 Lakh Crore Scam Exposed
SCAM: వాస్తవాలను దాచేస్తున్న బీజేపీ..బయటపడ్డ 7.5 లక్షల కోట్ల కుంభకోణం!
దేశంలో మరో స్కామ్ గురించి సర్వత్రా చర్చ నెలకొంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో రూ.7.5 లక్షల కోట్ల స్కామ్ జరిగినట్లుగా కాగ్ నివేదిక చెబుతోంది. ప్రతిపక్షాలు ఈ కుంభకోణం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం దీనిపై స్పందించడం లేదని పలువురు పెదవివిరుస్తున్నారు.
భారత్‌లో అనేక కుంభకోణాలు (Scams) వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మోదీ (Modi) ప్రభుత్వ పాలనలో కుంభకోణాలకు పాల్పడినవారు విదేశాలకు పరారయ్యారు. భారీ స్కామ్స్ జరిగినా మోదీ సర్కార్ మాత్రం మౌనం వహిస్తోంది. ప్రజాధనాన్ని అప్పనంగా తీసుకుని విదేశాలకు చెక్కేస్తున్నవారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేకుంది. ఇప్పుడు కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన మరో స్కామ్ గురించి సర్వత్రా చర్చ నెలకొంది. భారత్‌మాల పరియోజన పథకంలో రూ.7.5 లక్షల కోట్ల కుంభకోణం (7 Lakshs scam) జరిగినట్లు విపక్షాలు తేల్చిచెప్పాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా ఈ విషయం గురించి తెలియజేసింది.
ప్రధాని మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు ప్రధాని అబద్దాలు చెబుతున్నారన్నారు. కాగ్ (Cag) నివేదికలపై ప్రధాని మౌనం వీడాలన్నారు. తన సొంత ప్రభుత్వాన్ని, మంత్రుల అవినీతిని ప్రశ్నించే ధైర్యం మోదీకి లేదన్నారు. మోదీ ప్రభుత్వంలోని అవినీతిని కాగ్ నివేదిక బయటపెట్టిందని ఆరోపించారు.
అసలేంటి ఈ కుంభకోణం?
భారత్‌మాల పరియోజన పథకం అనేది దేశంలో రోడ్లను, రవాణాను విస్తరించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు విస్తరణకు కిలోమీటర్‌కు రూ.18 కోట్ల వినియోగించాల్సిందిపోయి రూ.250 కోట్లకు పెంచారు. అంటే 14 రెట్లు ఖర్చు చేశారు. ఇది ఓ కుంభకోణం అని కాగ్ నివేదిక తెలిపింది. అంతేకాకుండా ప్రజారోగ్య హామీ పథకం, ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకంలో అనేక వ్యత్యాసాలు జరిగినట్లు ప్రభుత్వ ఆడిటర్ పార్లమెంటులో ఓ నివేదికను కూడా సమర్పించారు.
AB-PMJAY డేటాబేస్‌లో చెల్లని పేర్లు, పుట్టిన తేదీల్లో వాస్తవాలు లేకపోవడం, నకిలీ ఐడీలు (Fake Id’s), కుటుంబీకుల పేర్లలో తప్పులు వంటివి గుర్తించినట్లు ప్రభుత్వ ఆడిటర్ నివేదికలో తేలాయి. భారత్‌మాల ప్రాజెక్ట్‌లో బీజేపీ (BJP) సర్కార్ రూ.78.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు కాగ్ నివేదిక స్వయంగా తెలపడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. 2023 మార్చి 31వ తేదికి 13,499 కి.మీ జాతీయ రహదారులు మాత్రమే పూర్తయ్యాయి. 30 శాతం కంటే తక్కువగానే రోడ్ల పనులు పూర్తి చేసినా అందులో చాలా వరకూ అవినీతి జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవాలన్నింటినీ బీజేపీ దాచేసి ప్రజలకు మంచి చేస్తున్నట్లు చెబుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.