»Muslim Girls Hair Shaved 14 Girls Were Shaved For Not Wearing Hijab Properly
Muslim Girls Hair Shaved: దారుణం..హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని 14 మంది బాలికలకు గుండు!
ప్రపంచ వ్యాప్తంగా హిజాబ్ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఇండోనేషియాలో హిజాబ్ సరిగా ధరించలేదని 14 మంది బాలికలకు స్కూల్ టీచర్ గుండు చేయించాడు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా హిజాబ్ (Hijab) వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఆ మధ్య కర్ణాటక (Karnataka)లోని ఓ స్కూల్లో హిజాబ్ ధరించిన వారికి అనుమతి ఇవ్వకపోవడంతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత ఇరాన్ (Iran) దేశంలో మహ్సా అమినీ అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ ధరించలేదని లాకప్ డెట్కు గురైంది. అప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఈ ఘటనలు కలకలం రేపుతూనే ఉన్నాయి.
తాజాగా ఇండోనేషియా (Indonesia)లో మరో హిజాబ్ (Hijab) వివాదం చెలరేగింది. ఆ దేశంలోని ఓ స్కూల్లో 14 మంది ముస్లిం బాలికలు తప్పుగా హిజాబ్ ధరించారని ఏకంగా పాఠశాల యాజమాన్యమే వారికి గుండు కొట్టించింది. పాఠశాల ఉపాధ్యాయుడు బాలికలకు గుండు చేయించాడు. ఈ ఘటన ఇండోనేషియాలోని మషారికి జావా ప్రభుత్వ జూనియర్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.
ఆగస్టు 23న పాఠశాలలోని 14 మంది బాలికలు సరిగ్గా హిజాబ్ (Hijab) ధరించడం లేదని ఓ ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేయగా మొత్తం 14 మందికి బాలికలకు గుండు గీయించారు. ఈ వివాదంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ క్లారిటీ ఇచ్చారు. పాఠశాల యాజమాన్యం బాలికలతో పాటుగా వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిందని, గుండు గీయించిన ఈ టీచర్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.