బర్త్ రేటుని పెంచేందుకు గాను చైనా ప్రభుత్వం (China govt) నానా తంటాలు పడుతోంది. యువత పెళ్లిళ్లు చేసుకుంటేనే బర్త్ రేటు పెరుగుతుంది కాబట్టి.. యువత(Youth)లో పెళ్లిపై ఆసక్తి పెంచేందుకు రకరకాల పథకాల్ని తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కొత్త స్కీమ్(New scheme)ని తీసుకొచ్చింది. చైనా ప్రభుత్వం పెళ్లి చేసుకునే యువతులకు గుడ్ న్యూస్ తెలిపింది. 25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు రివార్డ్ (Reward)ప్రకటించింది. జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యువతులు తగిన వయసులో పెళ్లి, పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నగదు బహుమతిని అందించనుంది. దీని ప్రకారం తొలి వివాహం (First marriage) చేసుకునే 25ఏళ్ల యువతులకు 1000 యువాన్లు (సుమారు రూ.11,500) ఇవ్వనుంది.
అయితే చైనా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది అంటే చైనా అని చూపించేవారు. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది.అందుకే బెజియాంగ్ రాష్టంలోని చాంగ్షాన్ కౌంటీ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో మొదటి వివాహం చేసుకునే స్త్రీ, పురుషులకు 20, 22 వయసు ఉండాలి. పెళ్లిళ్ల రేటు (Marriage rate) 2022లో 6.8 మిలియన్లకు పడిపోయింది. 2021తో పోలిస్తే గత సంవత్సరాల 8,00,000 వివాహాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఈ సంఖ్యను పెంచడం కోసమే చైనా (China)ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు, పిల్లల సంరక్షణ సౌకర్యాలతో పాటు అత్యవసరంగా అనేక చర్యలను తీసుకొస్తున్నారు. మరి.. ఈ కొత్త స్కీమ్ కారణంగా అయినా అక్కడ పెళ్లిళ్లు, జననాల రేటు పెరుగుతుందో లేదో చూడాలి.