BPT: అద్దంకిలో నూతన రెవిన్యూ డివిజన్ కార్యాలయం బుధవారం ప్రారంభం కానుంది. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌ను ఈ కార్యాలయంగా మార్చినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనిని ఏర్పాటు చేశామని, జనవరి 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.