MBNR: దేవరకద్ర నియోజకవర్గం కోయిల్ సాగర్ గ్రామ సర్పంచ్ సందప్ప ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం సందప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నానన్నారు.