గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీల వార్షిక రిటర్నులు, ఆర్థిక నివేదికల సమర్పణ గడువును కేంద్రం పొడిగించింది. కంపెనీలు తమ ఫైలింగ్‌లను 2026 జనవరి 31 లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు ఈనెల 31తో ముగియనుండగా, పొడిగించారు. ఫైలింగ్ వ్యవస్థలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.