HYD నగర పరిధిలో ఇప్పటివరకు సుమారు 1100 ఎకరాల భూమిని అక్రమ ఆక్రమణల నుంచి కాపాడినట్లు హైడ్రా వెల్లడించింది. ఈ భూముల మార్కెట్ విలువ రూ.60 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, ఓపెన్ ల్యాండ్స్పై దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని హైడ్రా స్పష్టం చేసింది.