KNR: ఇల్లందకుంట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఇల్లందకుంట సర్పంచ్ ధార సురేష్‌ను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో 18 మంది సర్పంచ్‌లు ఉండగా 10 మంది సురేష్‌కు మద్దతు తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా మర్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తోడేటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బుస అశోక్, రేనుకుంట్ల శ్యామల, కోశాధికారిగా చింతం శ్రీలతలను ఎన్నుకున్నారు.