BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి మంగళవారం రూ.26,27,261 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఇందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.11,12,890, కార్ పార్కింగ్ నుంచి రూ.3,35,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ.3,30,000, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.2,70,600, వ్రతాల ద్వారా రూ.92,000తో పాటు ఇతర విభాగాల నుంచి ఆదాయం వచ్చినట్లు వివరించారు.