NLR: జిల్లాలో జనవరి 2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం, గ్రామంలోనూ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 9వ తేదీ వరకు సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో రైతులకు వీటిని అందజేస్తామని వెల్లడించారు.