NZB: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాం ప్రసాద్‌కు జిల్లా విద్యాధికారి అశోక్ మంగళవారం గణిత రత్న అవార్డు ప్రదానం చేశారు. గణిత బోధనలో విశేష కృషికి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ, పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో గణిత రత్న అవార్డు ప్రదానం చేశారు.