GNTR: ప్రేమ పేరుతో 14 ఏళ్ల బాలికను వేధించిన కేసులో తమ్మిశెట్టి వినయ్‌కు తెనాలి పోక్సో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. 2022లో సుల్తానాబాద్‌కు చెందిన నిందితుడు బాలికను వేధించగా, తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.