NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా భద్రతను మరింత పటిష్టంగా నిలుపుకునేందుకు క్లౌడ్ పెట్రోలింగ్ విధానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 41 డ్రోన్లు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు మొత్తం 5,790 డ్రోన్ బీట్లు నిర్వహించారు. ప్రజలకు కనిపించకుండా భద్రత కల్పించడంలో డ్రోన్ పెట్రోలింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.