NZB: సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎడపల్లి ఆధ్వర్యంలో మంగళవారం జైతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వయోవృద్దుల పోషణ, రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వయోవృద్ధుల సమస్యలు, మన బాధ్యతపై అవగాహన కల్పించడం జరిగిందని బోధన్ డివిజన్ అధ్యక్షుడు మురహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.