అన్నమయ్య: వీరబల్లి మండలం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా వీరబల్లి మండలం, రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలపడం హర్షణీయమని టీడీపీ మండల అధ్యక్షులు భాను గోపాల్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు.