భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో (ISRO) చంద్రునిపై పరిశోధనలో భాగంగా చంద్రయాన్-3 (Chandrayan-3)ని పంపిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ విజయవంతం అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోను అందరూ ప్రశంసించారు. చంద్రునిపై కాలుమోపిన తర్వాత పలు అప్డేట్లను విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) అందిస్తూనే ఉంది. ప్రజ్ఞాన్ రోవర్ చేపడుతున్న పరిశోధనలను ఎప్పటికప్పుడు విక్రమ్ ల్యాండర్ ఇస్రోకు అందిస్తూ ఉంది.
ప్రజ్ఞాన్ రోవర్ తీసిన చంద్రయాన్3 ల్యాండర్ ఫోటోలు:
Chandrayaan-3 Mission:
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ (Pragnan Rover) బుధవారం ఉదయం విక్రమ్ ల్యాండర్ ఫోటోలను తీసింది. చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత విక్రమ్ ల్యాండర్, రోవర్కు సంబంధించిన చిత్రాలను ఇస్రో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా ల్యాండర్ ఫోటోలను రోవర్ తీయగా వాటిని ఇస్రో షేర్ చేసింది. సరదాగా ఆ ఫోటోకు ‘స్మైల్ ప్లీజ్’ అని ట్యాగ్ లైన్ ఇచ్చింది. చంద్రయాన్3 మిషన్ ఫోటోలను రోవర్ తన నావిగేషన్ కెమెరా ద్వారా (నావ్కామ్) తీసిందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-3 కోసం నావ్కామ్ను ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్(ఎల్ఈఓఎస్) అభివృద్ధి చేసినట్లు తెలిపింది.