»Relatives With Chairs At The Wedding Feast Video Goes Viral
Pak : పెళ్లి విందులో కుర్చీలతో తనుకున్న బంధువులు.. వీడియో వైరల్
పాకిస్థాన్ లో ఓ వివాహ వేడుకలో విందు జరుగుతున్న సమయంలో అతిథుల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కుర్చీలు మడతపెట్టి కొట్టుకునే వరకు వెళ్లింది
పెళ్లంటే అతిథులు, బంధువుల సంతోషం (Happiness) సరదా సందడి మధ్య సాగే అపురూప ఘట్టం. అయితే పెళ్లీ వేడుకల్లో ఎన్నో మరుపురాని సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. ఇవి జీవితంలో స్పెషల్గా నిలిచిపోతాయి.పెళ్లిళ్లల్లో విందు భోజనాలు (Meals) సాధారణమైన విషయమే కాకుండా అది తమ తాహతును తెలిపే విషయంగా పెళ్లి పెద్దలు భావిస్తుంటారు. మర్యాదలో ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని సార్లు విందు విషయంలో ఘర్షణలు తలెత్తుతాయి. అవి చినికి చినికి గాలి వానలా మారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతుంటాయి.
పాకిస్థాన్ (Pakistan)లో జరిగిన ఓ వివాహ వేడుక (Wedding)లో ఘర్షణ చోటు చేసుకుంది. వివాహ విందు సమయంలో అతిథులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివాహానికి హాజరైన అతిథులంతా విందు (Dinner) ఆరగించడం ప్రారంభించారు. అంతా ఎవరి టేబుల్స్ వద్ద వాళ్లు కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఇంతలో ఓ టేబుల్ వద్దకు వచ్చిన వ్యక్తి.. అక్కడ విందు ఆరగిస్తున్న అతిథి తలపై ఉన్న టోపీ (Hat)ని తీసేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణాల్లోనే అది పెద్ద గొడవకు దారి తీస్తుంది. అక్కడున్న వారు కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారిపోతాయి. ఒకరికొకరు కుర్చీలతో కొట్టుకోవడం మొదలు పెడతారు.
ఇలా చాలాసేపు ఫైటింగ్ (Fighting) కొనసాగుతుంది. చివరికి కొందరు బంధువులు కలుగజేసుకోవడంతో కొద్దిసేపటికి ఘర్షణ సద్దుమణుగుతుంది.ఆగస్టు 24వ తేదీ ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు (Netizens) రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘నాకు తగినన్ని మాంసం ముక్కలు లభించకపోతే ఇలానే విసుగు చెందుతాను’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆరు నిమిషాల నిడివి గల ఈ వీడియో (Video) ను ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వీక్షించారు.